యాచకుడి శవానికి మహిళా ఎస్.ఐ
అంతిమసంస్కారం
పోలీసుల్లోనూ మానవతా
మూర్తులుంటారని ఓ మహిళా ఎస్.ఐ. నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల అడవికొత్తూరు గ్రామ పొలాల్లో ఓ
గుర్తుతెలియని వృద్ధుడి శవం పడిఉందనే సమాచారంతో ఎస్.ఐ. శిరీష అక్కడకు
చేరుకున్నారు. ఆ వ్యక్తి ఎవరైఉంటారనే విషయమై ఆరా తీశారు. అతను బిచ్చగాడని తెలిసింది.
అయితే అక్కడి నుంచి శవాన్ని తరలించేందుకు స్థానికులు ముందుకు రాలేదు. దాంతో ఆమె
స్వయంగా తన భుజాలపై మృతదేహాన్ని మోసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. దాంతో కొందరు ఎస్సై
ఔదార్యానికి చలించి సహాయంగా భుజం కలిపారు. దాంతో అందరూ కలిసి రెండు కిలోమీటర్ల మేర
పొలం గట్లపై ఆ శవాన్ని మోసుకొచ్చి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. వీరికి
లలితా చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించింది. ఎస్సై శిరీష చూపిన చొరవకు పోలీసులతో
పాటు స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్
స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా శిరీషని ప్రత్యేకంగా అభినందించారు.
No comments:
Post a Comment