డోకిపర్రు వెంకన్న సన్నిధిలో పవర్ స్టార్
. https://www.youtube.com/watch?v=3jKNB2qvDe4
జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో శనివారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వారిని ఉద్దేశించి పవర్ స్టార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయాన్నిదర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండుమూడేళ్లుగా ఇక్కడకు రావాలనుకున్నా ఆ అదృష్టం ఇప్పుడు కల్గిందన్నారు. జిల్లాలో గల ప్రసిద్ధ ఆలయాల్లో ఇక్కడ శ్రీవారి ఆలయం కూడా ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుత కల్యాణోత్సవంలో పాలుపంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల తరహాలో ఈ ఆలయ వేద పండితులు పూజాది కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ ఆలయ వైభవానికి అహర్నిశలు శ్రమిస్తున్న కృష్ణారెడ్డి తదితరులకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment