రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ గంజాయి కలకలం రేగుతోంది. ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా భారీగా గంజాయి సాగవుతోందని ఇటీవల తరచు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో పెద్దఎత్తున గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గామన్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని నర్సీపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
No comments:
Post a Comment