`అత్యంత ముఖ్యమైన వ్యక్తి`కి బన్నీ విషెస్
నా జీవితంలో `అత్యంత ముఖ్యమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు` అంటూ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇన్ స్టాలో ఓ ఫొటో, కామెంట్ పోస్టు చేశారు. మంగళవారం బర్త్ డే జరుపుకుంటున్న భార్య స్నేహారెడ్డిపై ఆయన ఈవిధంగా ప్రేమాభిమానాల్ని కురుపిస్తూ ఈ మురిపించే పోస్ట్ పెట్టారు. అంతే అందమైన ఫొటోను పోస్ట్ కు జత చేశారు. అల్లు అర్జున్ తన దీర్ఘకాల ప్రేయసి స్నేహ రెడ్డిని మార్చి 6, 2011 న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఏప్రిల్ 3, 2014 న అల్లు అయాన్ జన్మించాడు. ఆ తర్వాత వీరి కుటుంబంలోకి నవంబర్ 21, 2016 న అల్లు అర్హా వచ్చి చేరింది. బన్నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో లో ఇటీవల అర్హా చూడముచ్చటైన వీడియోల సందడి అందరికీ తెలిసిందే. ఇదిలావుండగా 35వ ఏట అడుగుపెట్టిన స్నేహ తన భర్త, పిల్లలు, లేడీ ఫ్రెండ్స్ తో బర్త్ డే ను సందడిగా జరుపుకున్నారు. ఇన్ స్టాలో 10 లక్షల మంది ఫాలోవర్లను కల్గిన ఆమె ఫొటోలకు లైక్ ల వర్షం కురుస్తోంది.
No comments:
Post a Comment