గాయకుడు జేసుదాస్ సోదరుడు
అనుమానాస్పద స్థితిలో మృతి
ప్రముఖ గాయకుడు, సంగీతకారుడు జేసుదాస్ తమ్ముడు 62 ఏళ్ల కేజే జస్టిన్ కేరళలోని కొచ్చిలో
అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జస్టిన్ మృతదేహాన్ని వల్లర్పాదంలోని డీపీ వరల్డ్స్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ వద్ద కనుగొన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఆయన
కనిపించకుండా పోయారు. జస్టిన్ తన కుటుంబంతో కలిసి కక్కనాడ్ లోని అద్దె ఇంట్లో
నివసిస్తున్నారు. ఆయన అదృశ్యమయినట్లు బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ
క్రమంలో బుధవారం సాయంత్రం వల్లర్పాదం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు
ముల్వుకాడ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే పోలీసులు అసహజ మరణం
కింద కేసు నమోదు చేశారు. జస్టిన్ మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. ప్రాథమిక
దర్యాప్తు ప్రకారం పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం తన పెద్ద
కొడుకు మరణించినప్పటి నుంచి ఆయన తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. గత కొంతకాలంగా
మానసిక సమస్యలతోనూ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జస్టిన్ మరణానికి గల కారణాలను
పరిశోధిస్తున్నారు.
No comments:
Post a Comment