యూపీ ఉప ఎన్నికలో బీజేపీ నాయకుడు యువరాజ్ సింగ్ గెలుపు
ఉత్తరప్రదేశ్(యూపీ) లోని హమిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప
ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక్కడ గతంలో విజయం
సాధించిన బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ సింగ్ చందల్ హత్య కేసులో నేరం రుజువుకావడంతో అతని శాసనసభ్యత్వం రద్దయింది. 22 ఏళ్ల నాటి హత్య కేసులో ఆయనకు శిక్ష
పడింది. దాంతో సెప్టెంబర్ 23 (సోమవారం) హమిర్పూర్ లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఓట్ల
లెక్కింపును శుక్రవారం చేపట్టగా తాజా బీజేపీ అభ్యర్థి యువరాజ్ సింగ్ 17,846
ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 74,373 ఓట్లు పడగా సమీప ప్రత్యర్థి
సమాజ్ వాది పార్టీ(ఎస్పీ) అభ్యర్థికి 56,528 ఓట్లు వచ్చాయి. మూడు నాలుగు
స్థానాల్లో నౌషిద్ అలీ(బీఎస్పీ), హర్దీపక్ నిషద్ (కాంగ్రెస్) నిలిచారు. ఈ
ఉపఎన్నికలో మొత్తం 9మంది అభ్యర్థులు పోటీపడగా 51 శాతం ఓటింగ్ నమోదయింది. హమిర్పూర్
లో పార్టీ సీటును నిలబెట్టుకోవడంలో కృషి చేసిన కార్యకర్తలు, ప్రజలకు యూపీ సీఎం
యోగి ఆదిత్యనాథ్ శుభాభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment