ట్విటర్ ఖాతా తెరవగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ కు 10
లక్షల పాలోవర్లు
లోకమంతా ట్విటర్ బాటను
నడుస్తుంటే మేమెందుకు పోరాదనుకున్నారో ఏమో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
(ఆర్.ఎస్.ఎస్) అధినేత మోహన్ భగవత్ కూడా ట్విటర్ ఖాతా తెరిచారు. సోమవారం ఆయనతో పాటు
సంఘ్ కు చెందిన పదాధికారులు పలువురు ట్విటర్ బాట పట్టారు. సంఘ్ ప్రధానకార్యదర్శి
సురేశ్ భయ్యాజీ జోషి, సంయుక్త కార్యదర్శి సురేశ్ సోని తదితర ఆరుగురు పదాధికారులు
ట్విటర్ అకౌంట్లు తెరిచారు. సంఘ్ కు సంబంధించిన ప్రకటనలు విడుదల చేయడానికే ఆయన
ట్విటర్ ఖాతా తెరిచారు. @DrMohanBhagwat పేరిట గల తన ట్విటర్ అకౌంట్ మనుగడలోకి
వచ్చిందో లేదోనని భగవత్ ఓసారి తనిఖీ చేసి చూసుకున్నారు. అయితే ఆయన ఇంకా ట్వీట్ ఏదీ చేయలేదు. ఆయన ఇంతవరకు ఒక్క ట్వీట్ చేయకున్నా 10 లక్షల 30 వేల మంది ఫాలోవర్లు వచ్చి
చేరడమే విశేషం.
No comments:
Post a Comment