ఫైనల్ కు ఇంగ్లాండ్ రె`ఢీ:`ఏకపక్ష మ్యాచ్ లో ఆస్ట్రేలియా చిత్తు
వరల్డ్
కప్-12 రెండో సెమీస్ మ్యాచ్ చూస్తే అచ్చం భారత్ మాదిరిగా ఆస్ట్రేలియా కనిపించింది.
వరల్డ్ కప్ నాకౌట్ కు ముందు పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన
భారత్ తొలి సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయింది. టాస్, వర్షం, ధోని రనౌట్
మ్యాచ్ ను కివిస్ వశం చేశాయి. అయితే గురువారం రెండో సెమీస్ లో టాస్ గెలిచిన
ఆస్ట్రేలియా బర్మింగ్ హమ్ ఎడ్జ్ బస్టన్ మైదానంలో బ్యాటింగ్ ఎంచుకుని బోల్తా
పడింది. తొలి సెమీస్ కు యాక్షన్ రిప్లేలా రెండో సెమీస్ లో ఆస్ట్రేలియా ఆడింది.
తొలి 6 ఓవర్లలో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అలెక్స్ కేరీ(46),
స్టీవ్ స్మిత్(87) అడ్డం పడకపోతే ఆస్ట్రేలియా వికెట్ల పతనం ఆగేది కాదు. 223 పరుగుల
గౌరవప్రదమైన స్కోర్ కు చేరే అవకాశమే ఉండదు. కేరీ, స్మిత్ జోడి నాల్గో వికెట్ కు
103 పరుగులు జత చేశారు. కెప్టెన్ ఆరన్ ఫించ్(0), డేవిడ్ వార్నర్(9), పీటర్ హ్యాండ్
కోంబ్(4) టాప్ ఆర్డర్ లో తక్కువ స్కోర్ కే బ్యాట్లు ఎత్తేశారు. ఆసిస్ ఇన్నింగ్స్ లో ఇద్దరు
డకౌట్లు కాగా మరో అయిదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. ఆ
జట్టు 49 ఓవర్లకే ఆలౌటయింది. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ వోక్స్, ఆడిల్ రషీద్ చెరో 3
వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, మార్క్ వుడ్ 1 వికెట్ తీశారు.
తనను
టైటిల్ ఫెవరెట్ గా క్రికెట్ విశ్లేషకులు ఎందుకు పేర్కొంటున్నారో ఆసీస్ తో సెమీస్ మ్యాచ్
లో ఇంగ్లాండ్ ఆడి చూపించింది. బౌలింగ్ లో చండప్రచండమైన బంతులతో ప్రత్యర్థిని
వణికించిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో పిడుగుల్లాంటి షాట్లతో హోరెత్తించింది. ఛేదన
లక్ష్యం న్యూజిలాండ్ 239 పరుగుల స్కోరు భారత్ ముందుంచిన మాదిరిగానే ఆస్ట్రేలియా
223 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఎదుట పెట్టింది. తేడా ఒక్కటే అక్కడ భారత్
తలొగ్గితే ఇక్కడ ఇంగ్లాండ్ దుమ్మురేపింది.
ఇన్నింగ్స్
ప్రారంభం నుంచి ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయి పరుగులు సాధించారు. బౌండరీలు,
సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే ఆసిస్ పేసర్లు కూనల్లా మారిపోయారు. ముఖ్యంగా ఓపెనర్ జాసన్
రాయ్(85) 65 బంతుల్లో 5 సిక్సర్లు, 9 బౌండరీలతో ఆసిస్ బౌలింగ్ ను తునాతునకలు చేశాడు.
మిచెల్ స్టార్క్ ప్రధాన బాధితుడు. ఓవర్ కు 7.78 పరుగుల చొప్పున 9 ఓవర్లలో జానీ
బెయిర్ స్టో(34) ఒకే ఒక వికెట్ తీసుకుని 70 పరుగులు సమర్పించుకున్నాడు. జాసన్ రాయ్
వికెట్ పాట్ కమిన్స్ కు దక్కింది. జోయ్
రూట్(49*), మోర్గాన్(41*) చివరి
వరకు క్రీజ్ లో నిలిచి ఇంగ్లాండ్ ను ఫైనల్ కు చేర్చారు. ఆ జట్టు ఇంకా దాదాపు 18
ఓవర్లు మిగిలి ఉండగానే 32.1 ఓవర్లలో 226 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. జాసన్
బెరండ్రాఫ్ బౌలింగ్ లో కెప్టెన్ మోర్గాన్ విన్నింగ్ షాట్ బౌండరీ కొట్టాడు. 3 వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
తొలిసారి
వరల్డ్ కప్ విజేత ఎవరో?
లండన్ లార్డ్స్
లో ఆదివారం తుది పోరుకు న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ జట్టు సిద్ధమౌతోంది. ఇంగ్లాండ్ ఫైనల్స్ కు చేరడం ఇది మూడోసారి 1987,1992,2019ల్లో ఆ
జట్టు ఫైనల్ కు చేరగా మరో జట్టు న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్ (2015, 2019)
కు చేరింది. ఈ రెండు జట్లు ఫైనల్ లో తలపడ్డం ఇదో తొలిసారి. రెండింటిలో ఏ జట్టు
గెలిచిన తొలిసారి వరల్డ్ కప్ సాధించిన జట్టుగా రికార్డుల్లో చోటు
దక్కించుకోనుంది.
No comments:
Post a Comment