ఆస్ట్రేలియాను కంగు తినిపించిన
దక్షిణాఫ్రికా
§ సెమీస్-1: భారత్ x న్యూజిలాండ్ § సెమీస్-2: ఆస్ట్రేలియా x ఇంగ్లాండ్
కంగారూల జట్టు ఆస్ట్రేలియాపై కొదమసింహలా పోరాడిన దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన
విజయాన్ని సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్-12 మాంచెస్టర్ ఎమిరేట్స్ ఓల్డ్
ట్రాఫర్డ్ మైదానంలో శనివారం జరిగిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ నం.45 లో సఫారీల జట్టు టాస్ గెలిచి ముందు
బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 భారీ పరుగుల్ని
చేసింది. జట్టు కెప్టెన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయిన ఫాప్ డూప్లెసిస్(100)
సెంచరీ సాధించాడు. రస్సీ వాండర్ సన్(95) ఆసిస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని పరుగుల
వరద పారించాడు. ఓపెనర్లు అడెన్ మర్క్రామ్(34), కీపర్ బ్యాటర్ క్వింటాన్ డికాక్(52)
రాణించడంతో భారీ స్కోరును ప్రత్యర్థి ఆస్ట్రేలియా ముందుంచారు. ఆసీస్ బౌలర్లలో
మిషెల్ స్టార్క్, నాథన్ లయాన్ చెరో 2 వికెట్లు, జాసన్ బెరండ్రాఫ్, పాట్ కమిన్స్
చెరో 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం 326 పరుగుల ఛేదన లక్ష్యంతో బ్యాటింగ్
ప్రారంభించిన కంగారూల జట్టు భారీ స్కోరయినా ప్రత్యర్థికి దాసోహం అనేదే లేదు
అన్నట్లుగా పోరాడింది. ఓపెనర్ కెప్టెన్ ఆరన్ ఫించ్(3) స్పిన్నర్ తాహిర్ బౌలింగ్ లో
మార్క్రమ్ కు క్యాచ్ ఇచ్చి త్వరగా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ సీనియర్ బ్యాట్స్
మన్ డేవిడ్ వార్నర్(122) టోర్నీలో మరో సెంచరీతో కదం తొక్కాడు. మిడిల్ ఆర్డర్ లో
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరె(85) పరుగులతో చివర్లో మెరుపులు
మెరిపించినా జట్టులో చివరి వరుస బ్యాట్స్ మెన్ నిలబడకపోవడంతో విజయాన్ని
సాధించిపెట్టలేకపోయాడు. మార్కస్ స్టోయినిస్(22) మాత్రమే జట్టులో చెప్పుకోదగ్గ
పరుగులు చేశాడు. ఉస్మాన్ ఖవాజా(18), మిషెల్ స్టార్క్(16) స్కోరు అందుకునే క్రమంలో రబాడ
వేసిన 49 ఓవర్లో వెంటవెంటనే వెనుదిరగడంతో చివరి 6 బంతుల్లో ఒక్క వికెట్ చేతిలో
ఉండగా 18 పరుగులు చేయాల్సిన స్థితికి వచ్చింది. పెహ్లుక్వాయో వేసిన 50 ఓవర్ నాల్గు
బంతుల్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి రెండు బంతుల్లో 11 పరుగులు చేయాల్సి
ఉండగా రనౌట్ నుంచి తప్పించుకున్న లయాన్ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో మార్క్రమ్
క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. బెరండ్రాఫ్(11*) నాటౌట్ గా మిగిలాడు. 49.5 ఓవర్లలో ఆసిస్ 315 పరుగులకు
ఆలౌటయింది. సఫారీల బౌలర్లలో కగిసొ రబాడకు 3 వికెట్లు దక్కగా, డ్వయిన్ ప్రెటోరిస్ 2
వికెట్లు పడగొట్టాడు. ఇమ్రాన్ తాహిర్, క్రిస్ మోరిస్ లు చెరో వికెట్ తీశారు.
No comments:
Post a Comment