Wednesday, July 3, 2019
Ambati Rayudu retires all forms of cricket after being ignored this World Cup
అంబటి
రాయుడు అలక:అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటన
భారత క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు అలకబూనాడు. వరల్డ్
కప్ కు తనను ఎంపిక చేయలేదని అప్పటి నుంచి రాయుడు కినుక వహించాడు. చివరకి అతణ్ని
స్టాండ్ బైగా ప్రస్తుత వరల్డ్ కప్ కు ఎంపిక చేశారు. శిఖర్ ధావన్ గాయంతో వరల్డ్ కప్
నుంచి తప్పుకోవడంతో మరో స్టాండ్ బై గా ఎంపికైన పంత్ కు మ్యాచ్ లు ఆడే అవకాశం
వచ్చింది. ఆ తర్వాత విజయ్ శంకర్ కూడా గాయంతో వైదొలగడంతో రాయుడికి అవకాశం
దక్కవచ్చని అందరూ భావించారు. అయితే మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో
రాయుడు ఇక తను భారత జట్టులోనే కొనసాగకూడదని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. మంచి భవిష్యత్ ఉన్న రాయుడు క్రికెట్ అంటే వరల్డ్ కప్ గానే భావించడం సరికాదు. భారత
జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర అంతర్జాతీయ మ్యాచ్ లో పాల్గొనడం కూడా ప్రతిష్ఠాత్మకమేనని
గ్రహించాలి. 2013లో భారత జట్టుకు ఎంపికై జింబాబ్వేపై తొలి వన్డే ఆడాడు.
ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే చివరి మ్యాచ్. 55 వన్డేల్లో 47.05 సగటుతో 1694 పరుగులు
చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ
సెంచరీలున్నాయి. అలాగే ఆరు టీ-20 మ్యాచ్ లు ఆడిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కేవలం
42 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు 124. రాయుడు మొత్తం 97 ఫస్ట్
క్లాస్ మ్యాచ్ లు ఆడి 6,151 పరుగులు చేశాడు. రాయుడు రిటైర్మెంట్ లేఖ అందినట్లు
బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment