సీఎం మమతతో ప్రశాంత్ కిశోర్ భేటీ
రాజకీయ వ్యూహ కర్త
బిహార్ జనతాదళ్(యునైటెడ్) నాయకుడు ప్రశాంత్ కిశోర్(పీకే) పశ్చిమబెంగాల్
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. గురువారం(జూన్6) వీరిద్దరు కోల్ కతాలోని
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీ కార్యాలయంలో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
కల్గించింది. గత కొద్ది కాలంగా టీఎంసీతో కలిసి పీకే పనిచేయనున్నారనే వార్తలకు ఈ
భేటీ బలం చేకూర్చింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 18 లోక్ సభ
స్థానాలు చేజిక్కించుకున్న దరిమిలా టీఎంసీ వర్గాల్లో కలవరం పెరిగింది. 2014 సార్వత్రిక
ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కేవలం 2స్థానాల్లోనే విజయం సాధించింది. 2021లో పశ్చిమబెంగాల్
అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా పీకేను దగ్గరకు
తీసుకోవాలనే ఆత్రుత టీఎంసీ వర్గాల్లో పెరిగిపోయింది. పీకే 2014 సార్వత్రిక ఎన్నికల్లో
బీజేపీకి వ్యూహకర్త గా వ్యవహరించారు. 2015 ఎన్నికల్లో బిహార్ లో మహఘట్ బంధన్(ఆర్జేజీ,జేడీ(యూ),కాంగ్రెస్
కూటమి) వ్యూహకర్తగా పనిచేశారు. అనంతరం ఆయన జేడీయూ లో చేరి బిహార్ నాయకుడిగా
ఉన్నారు. రెండేళ్ల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్.సి.పి. ప్రచార,
వ్యూహకర్తగా పని చేశారు. ఆయన వ్యూహకర్తగా పనిచేసిన అన్ని పార్టీలు ఆయా ఎన్నికల్లో
ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి. దాంతో దేశంలోనే గొప్ప రాజకీయ వ్యూహకర్తగా పీకే
పేరు గడించారు.
No comments:
Post a Comment