జమ్ముకశ్మీర్లో
ఘోర దుర్ఘటన:9మంది విద్యార్థినుల సహా 11మంది మృతి
జమ్ముకశ్మీర్ లో
జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 11 మంది అసువులు బాశారు. దుర్ఘటన గురువారం
లాల్ గులాం ప్రాంతంలో చోటు చేసుకుంది. పూంచ్ నుంచి సోఫియాన్ కు ప్రయాణిస్తున్న
టెంపో రహదారిపై పక్కకు జారిపోయి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 9 మంది విద్యార్థినులతో పాటు మొత్తం 11 మంది ప్రాణాలు
కోల్పోయినట్లు సమాచారం. పీర్ కి గలీ ప్రాంతంలో చారిత్రక మొఘల్ రోడ్డుపై జరిగిన
రోడ్డు ప్రమాదాల్లో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే ప్రథమం. ఈ ప్రాంతం
దక్షిణ కశ్మీర్ సోఫియాన్ జిల్లాలో ఉంది. సూరాన్ కోట్ కు చెందిన ఓ ప్రయివేట్
కంప్యూటర్ విద్యా సంస్థ కు చెందిన విద్యార్థినులు విహారయాత్రకు బయలుదేరి ప్రమాదం
బారిన పడ్డారు. వీరంతా ధోబిజాన్ దిశగా టెంపోలో ప్రయాణిస్తున్నారు. సమాచారం అందగానే
ప్రమాదస్థలానికి చేరుకున్న అధికారవర్గాలు వెంటనే సహాయక చర్యల్ని చేపట్టాయి. అయిదుగురు
క్షతగ్రాతుల్ని హుటాహుటిన శ్రీనగర్ లోని ఎస్.ఎం.హెచ్.ఎస్. ఆసుపత్రికి తరలించారు.
అంతకుముందు సోఫియాన్ జిల్లా ఆసుపత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. క్షతగ్రాతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment