ఉత్తరాఖండ్
అడవుల్లో పెద్దపులి మృతి
ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ పరిధిలోని కాబొంట్ టైగర్
రిజర్వ్(సీటీఆర్) పారెస్ట్ లో శుక్రవారం సాయంత్రం పెద్దపులి కళేబరాన్ని
కనుగొన్నారు. మృతి చెందిన పులికి పదేళ్లుండొచ్చని అటవీశాఖ అధికారులు తెలిపారు.
మృతికి గల కారణాలు స్పష్టం కాలేదు. అయితే పులులు ఒకదానితో మరొకటి పోరాడిన
సందర్భాల్లోనే ఎక్కువగా వీటి మరణాలు సంభవిస్తుంటాయని అటవీ అధికారులు
భావిస్తున్నారు. ఈ ఏడాది ఈ అడవుల్లో పులి మృత్యువాత పడిన ఘటనల్లో ఇది మూడోది. పులి
మృతి చెందిన పరసరాల్లో నీటి వాగులు వద్ద, నేలపైన నమూనాల్ని సేకరించారు. పులి
శరీరంలోని అంతర్భాగాల నమూనాల్ని సేకరించి భద్రపరిచారు. పులి కళేబరానికి పరీక్షలు
నిర్వహించాక దహన కార్యక్రమాలు పూర్తి చేశారు.
No comments:
Post a Comment