ప్రమాదవశాత్తు తుపాకీ పేలి కానిస్టేబుల్
మృతి
మధ్యప్రదేశ్
కెజాడియా గ్రామంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్
మరణించాడు. బుధవారం జరిగిన ఘటనలో 23 కానిస్టేబుల్ విధుల్లో ఉండగా చేతిలోని తుపాకీ నుంచి
ఒక్కసారిగా బుల్లెట్ వెలువడింది. అతని గడ్డం నుంచి తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో
అక్కడికక్కడే ప్రాణాలొదినట్లు తెలుస్తోంది. మృతి చెందిన కానిస్టేబుల్ రాత్రి వేళ
విధుల్ని మరో సహచరుడితో కలిసి చేపట్టినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
కానిస్టేబుల్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతోందని పోలీస్ అధికార వర్గాలు
పేర్కొన్నాయి.
No comments:
Post a Comment