రూపాయి 22 పైసల పతనం 70.08 డాలర్ తో మారకం
భారత్ రూపాయి తాజాగా గురువారం(ఏప్రిల్25) 22 పైసలు పతనమైంది. ఫారెక్స్ (ఇంటర్
బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్) మార్కెట్ ప్రకారం డాలర్ తో మారకంలో 70.08 పలుకుతోంది.
ప్రస్తుతం ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ కు డిమాండ్ రావడం ఇందుకు
కారణం. బుధవారం కూడా రూపాయి 24 పైసలు
పతనమై డాలర్ తో మారకంలో 69.86 వద్ద నిలిచింది. ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా
ఆంక్షలు విధించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ద్రవ్యోల్బణమూ
రూపాయి పతనానికి కారణంగా భావిస్తున్నారు. ఇలాగే ముడి చమురు ధరలు పెరుగుదల కొనసాగితే
ఆ ప్రభావం ఆయా దేశాల కరెన్సీ విలువలు మరింత దిగజారే ప్రమాదముంది.
No comments:
Post a Comment