అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె
ఇవాంక ట్రంప్ తండ్రి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ప్రెసిడెంట్ సీనియర్ అడ్వయిజర్ గా
వ్యవహరిస్తున్న ఆమెను ప్రపంచ బ్యాంక్ చీఫ్ బాధ్యతల్నీ తీసుకోవాల్సిందిగా ట్రంప్
కోరారు. అయితే ఇవాంక తనకు ఇష్టమైన పనే చేస్తానని.. శ్రామిక, మహిళా
సాధికారత రంగాలలో సేవల పట్ల మక్కువని పేర్కొన్నారు. నాలుగు రోజుల ఆఫ్రికా పర్యటనలో
భాగంగా చివరి రోజు బుధవారం (ఏప్రిల్17) ఇథోయోఫియా, ఐవరీకోస్ట్ ల్లో ఇవాంక పలు
కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేటెడ్ ప్రెస్ తో ఆమె మాట్లాడుతూ పై విషయాన్ని తెలిపారు. త్వరలో ట్రంప్ కూడా ఇక్కడ పర్యటనకు వస్తారన్నారు. ఆఫ్రికా దేశాలతో సహా
ప్రపంచమంతా ముఖ్యంగా మహిళలు అభివృద్ధి చెందాలన్నదే అమెరికా లక్ష్యమని ఇవాంక
పేర్కొన్నారు. సొంత ఆసక్తితోనే ఇవాంక ప్రస్తుత ఆఫ్రికా పర్యటనకు రావడం గమనార్హం.
No comments:
Post a Comment