తమిళనాడులో ఫ్రిడ్జ్ పేలి ముగ్గురి దుర్మరణం
తమిళనాడులో ఫ్రిడ్జ్ పేలిన దుర్ఘటనలో
మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శుక్రవారం ఈ ప్రమాదం చెంగల్‌పేట జిల్లా గుడువాంచేరి
పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ఆర్ఆర్ బృందావన్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్
లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ కంప్రెషర్ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భారీ పేలుడు శబ్దం విని అపార్ట్మెంట్లోని
ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఇల్లంతా మంటలు,
దట్టమైన పొగలు వ్యాపించాయి. దుర్ఘటనలో గిరిజ (63),
ఆమె సోదరి రాధ (55),
ఆమె సోదరుడు రాజ్‌కుమార్ (47) అక్కడికక్కడే ప్రాణాలు
విడిచారు. ఈ అపార్ట్మెంట్లో ఏడాది క్రితం మృతి చెందిన వెంకట్రామన్ ఇంట్లో ఈ ఘటన
జరిగింది. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న అతని భార్య గిరిజ సహా అతని కుటుంబం వెంకట్రామన్కు
వార్షిక కర్మలు (శ్రాద్ధం) చెల్లించడానికి గురువారం రాత్రి ఇక్కడ ఇంటికి వచ్చారు. ప్రమాద సమయంలో వీరితో
పాటు రాజ్‌కుమార్ భార్య భార్గవి (35), అతని
కుమార్తె ఆరాధన (6) ఉన్నారు. వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని క్రోంపేట
ప్రభుత్వ కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.