కేసీఆర్ త్వరగా కోలుకోవాలని
మహేష్ బాబు ట్వీట్
తెలంగాణ ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్
చేశారు. కేసీఆర్ కు సోమవారం నిర్వహించిన ఆర్టీ పీసీఆర్, యాంటిజెన్ పరీక్షల్లో కరోనా
పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల కోవిడ్ బారిన పడ్డ రాష్ట్ర ప్రభుత్వ
ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తో పలు సందర్భాల్లో కేసీఆర్ భేటీ అయ్యారు. దాంతో
ఆయనలో స్వల్ప కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆయన గజ్వేల్ లోని సొంత వ్యవసాయ
క్షేత్రంలో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 10 రోజుల పాటు ఆయన అక్కడే అవసరమైన చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటారని వ్యక్తిగత
వైద్యులు డాక్టర్ ఎంవీరావు తెలిపారు. కేసీఆర్ గొప్ప పోరాటయోధుడని ఆయన త్వరలోనే
పూర్తిగా కోలుకుంటారని ఎవరూ ఆందోళన చెందవద్దంటూ తనయుడు కేటీరామారావు ట్వీట్
చేశారు. ఈ నేపథ్యంలో యావత్ తెలుగుపరిశ్రమ కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా
కోలుకోవాలని ఆకాంక్షించింది. కేటీఆర్ తో వ్యక్తిగత స్నేహమున్న మహేశ్ బాబు వెంటనే
స్పందించి సీఎం ఆరోగ్యం గురించి వాకబు చేసినట్లు సమాచారం.