కేసీఆర్, జగన్ లకు ఎన్టీఆర్ ఆశీస్సులు:లక్ష్మీ పార్వతి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత
నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉభయ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్
రావు, వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిలకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన సతీమణి
లక్ష్మీ పార్వతి అన్నారు. ప్రజల కోసం అహరహం శ్రమించి వారి గుండెల్లో చెరగని ముద్ర
వేసిన ఎన్టీఆర్ ఈ ఇద్దరి నేతలకు ఆదర్శమని ఆమె గుర్తు చేశారు. అందుకే వారికి ఆ
మహనీయుని ఆశీస్సులు సదా తోడుగా ఉంటాయన్నారు. ఎన్టీఆర్ 97వ జయంతిని పురస్కరించుకుని
ఆయన కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. లక్ష్మీపార్వతి కూడా విడిగా
ఆయన సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయ, తనయులు పురందేశ్వరి, బాలకృష్ణ ఘాట్ లో ఈ సందర్భంగా తమ తండ్రి ఘనకీర్తిని గుర్తు
చేసుకున్నారు.