కరోనాపై రోబోల యుద్ధం
కరోనా మహమ్మారి బెడద దీర్ఘకాలంగా
కొనసాగనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరికల నేపథ్యంలో భారత్ సైతం
టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. చైనా, జపాన్ లాంటి దేశాల్లో విరివిగా కనిపించే రోబోలు మన దేశంలోనూ ఇబ్బడిముబ్బడిగా మోహరించనున్నాయి.
రాజస్థాన్ జైపూర్‌లోని ఓ టెక్నాలజీ కంపెనీ
కరోనా వారియర్ రోబోలను తయారుచేస్తోంది. ఈ రోబోలు కరోనా రోగులకు సేవలు చేసే
డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు
తోడుగా సేవలందించనున్నాయి. ఈ రోబోలు స్వయంగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తాయి.
మనిషి వాటి ముందు నిల్చుంటే చాలు స్క్రీనింగ్ చేసి `మీకు టెంపరేచర్ నార్మల్‌గా ఉంది` లేదంటే.. `మీకు టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉంది` అని క్షణాల్లో చెప్పేస్తాయి. మాస్క్ లేకుండా ఎవరైనా వస్తే
..హలో.. మాస్క్ పెట్టుకోవాలి అని హెచ్చరిస్తాయి` అని కంపెనీ ఎండీ భువనేశ్ మిశ్రా తెలిపారు. ఇప్పటికే బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో
రోబోల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అవి కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో
చెప్పేస్తున్నాయి. వాయిస్ ను బట్టి జలుబు
ఉందా లేదా అని గుర్తిస్తున్నాయి. టెంపరేచర్ చెక్ చేసి రిపోర్టు పేపర్ చేతిలో
పెడతాయి. ఆ స్లిప్ తో ఆసుపత్రి లోపలకు వెళ్లి చికిత్స అవసరమైతే పొందొచ్చు. ఇటీవల తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ 10 రోబోలను అక్కడి ఓ ప్రభుత్వాస్పత్రికి కానుకగా ఇచ్చింది.
No comments:
Post a Comment