ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం షాక్
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయి. వాహనదారులకు వై.ఎస్.ఆర్.సి.పి.
ప్రభుత్వం ఈ మేరకు షాక్ ఇచ్చింది. వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో
పెట్రోలు, డీజిల్ ధరలు
భగ్గుమననున్నాయి. వాణిజ్యపన్నుల శాఖ
వ్యాట్ పెంపు ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్ మీద వ్యాట్ 31 శాతం వడ్డనతో లీటర్కు
రూ.2.76 వరకు ధర పెరగనుంది. డీజిల్ మీద వ్యాట్ 22.25 శాతం కలుపుకుని లీటర్ ధర రూ.3.07కు పెరుగుతుంది.
ప్రస్తుతం ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.07 ఉండగా డీజిల్ రూ.70.67 ధరగా ఉంది.
కాగా దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో 71.94/64.65, కోల్ కతా 74.58/66.97, ముంబయి 77.60/67.75, చెన్నైలో
74.73/68.27 ధరలు అమలులో ఉన్నాయి.