Monday, February 24, 2020

US President Mr and Mrs Trump,PM Modi’s mega roadshow in Ahmedabad

ట్రంప్ న‌మోః

  • అమెరికా అధ్య‌క్షుడి భార‌త్ ప‌ర్య‌ట‌న షురూ


అమెరికా ప్ర‌థ‌మ పౌరులు డోనాల్డ్, మెలానియా ట్రంప్ దంప‌తులు భార‌త్ విచ్చేశారు. స్థానిక‌ కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.30కు అహ్మ‌దాబాద్ (గుజ‌రాత్) చేరుకున్నారు. వీరితో పాటు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా రెండ్రోజుల భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొంటున్నారు. ఆమె భార‌త్ కు విచ్చేయ‌డం ఇది రెండోసారి. 2017 న‌వంబ‌ర్ లో ఇవాంక భార‌త్ కు విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ నుంచి ట్రంప్ దంప‌తులు నేరుగా స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మానికి చేరుకున్నారు. అక్క‌డ వీరికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. మ‌హాత్మాగాంధీ ఆశ్ర‌మంలో త‌మ అనుభూతుల్ని ట్రంప్ దంప‌తులు సందేశ పుస్త‌కంలో రాశారు. ఈ సంద‌ర్భంగా మోదీ వారికి గాంధీజీ సిద్ధాంతాలు అహింసా, స‌త్య‌మేవ‌జ‌య‌తే గురించి తెలిపారు. బాపూజీ ప్ర‌వ‌చిత మూడు కోతుల నీతిని వివ‌రించారు. `చెడు చూడ‌కు, చెడు విన‌కు, చెడు మాట్లాడ‌కు` అనే నీతిని వివ‌రిస్తూ అక్క‌డ గ‌ల మూడు కోతుల బొమ్మ‌ల‌ను ట్రంప్ దంప‌తుల‌కు మోడీ చూపించారు. అద్భుత‌మైన అతిథ్య‌మిచ్చిన ప్రియ‌మిత్రుడు మోదీకి ధ‌న్య‌వాదాలు అని ట్రంప్ పేర్కొన్నారు. అనంత‌రం `న‌మ‌స్తే ట్రంప్` కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు ట్రంప్ దంప‌తుల‌తో క‌లిసి మోదీ ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మోతెరా (స‌ర్దార్ ప‌టేల్)కు  చేరుకున్నారు. భార‌త్ - అమెరికా మైత్రి ప‌టిష్ట‌త కోసం ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మానికి రాజ‌కీయ‌, సినీ, క్రీడా ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

No comments:

Post a Comment