నవీన్ పట్నాయక్ అయిదోసారి
సీఎంగా జయకేతనం
ఒడిశాలో మళ్లీ బిజూ జనతాదళ్(బీజేడీ)
అధికారాన్ని చేజిక్కించుకుంది. అయిదోసారి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కానున్నారు.
రాష్ట్రంలోని 147 అసెంబ్లీ, 21 లోక్ సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న జరిగిన
ఎన్నికల్లో నవీన్ సారథ్యంలో బీజేడీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. 2000 వ
సంవత్సరం నుంచి సీఎంగా ఎన్నికవుతున్న నవీన్ 2019లో మరోసారి ఆ పదవిని అధిష్టించనున్నారు.
నవీన్ పట్నాయక్ తల్లిదండ్రులు జ్ఞాన్
పట్నాయక్(పంజాబీ), బిజూ పట్నాయక్(మాజీ
ముఖ్యమంత్రి)లకు 1946, అక్టోబర్16న కటక్ లో జన్మించారు. తండ్రి బిజూ పట్నాయక్
ఒడిశా ముఖ్యమంత్రిగా 1961-63లో తొలిసారి పనిచేశారు. తర్వాత 1990-95 వరకు రెండోసారి సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలించారు.
1997లో బిజూ పట్నాయక్ మరణానంతరం ఆయన
ద్వితీయ కుమారుడు నవీన్ పట్నాయక్ 11వ లోక్ సభకు అస్కా నియోజకవర్గం నుంచి తొలిసారి
ఎన్నికయ్యారు.