వైఎస్సార్సీపీ తూ.గో. నేత మృతి: సీఎం సంతాపం
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ కరోనాతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చురుగ్గా పనిచేస్తున్నారు. కరోనా సోకడంతో గత కొంతకాలంగా విశాఖపట్నంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇటీవల సీఎం జగన్.. ఫ్రూటీకుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి చంద్రకళా దీప్తికి ఫోన్ చేసి ఆరా తీశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన అకాల మరణం బాధిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలా జరగడం పట్ల విచారం వెలిబుచ్చారు.