భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ సిద్ధం
కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేసిన
భారత్ బయోటెక్ సంస్థకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్-ఢిల్లీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి-పుణె)
సహకారంతో హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ `కోవాక్సిన్` పేరిట ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. దేశంలోని తమ మొదటి స్వదేశీ కోవిడ్ -19 వ్యాక్సిన్ మానవ క్లినికల్ ట్రయల్స్‌కు
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి అనుమతి లభించిందని కంపెనీ
సోమవారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ
క్లినికల్ ట్రయల్స్ జులై లో దేశవ్యాప్తంగా ప్రారంభమవుతాయి. ఐసిఎంఆర్, ఎన్ఐవి ల సహకారం టీకా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిందని కంపెనీ ఈ
సందర్భంగా పేర్కొంది. నగరంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్
బయో-సేఫ్టీ లెవల్ 3 (బిఎస్ఎల్ -3) హై కంటైనర్ ఫెసిలిటీలో ఈ
వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. డీజీసీఐ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ 1,2 దశల మానవ క్లినికల్ ట్రయల్స్
ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. సంస్థ ప్రీ-క్లినికల్ అధ్యయన ఫలితాలను
సమర్పించిన తరువాత ఈ ముందడుగు పడింది. జూలై 2020 లో దేశం
అంతటా మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానుండడం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో శుభసూచకంగా భావించాలి.