27 ఏళ్లు గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు:షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ తన సినీ నట
జీవితం ప్రారంభమై 27 ఏళ్లు గడిచిన సందర్భంగా అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపాడు. దీవానా
హిందీ చిత్రం ఇదే రోజున విడుదలయి సూపర్ హిట్ అయింది. రాజ్ కన్వర్ ద్వారా కింగ్
ఖాన్ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ బాద్ షా గా
ఎదిగాడు. ఈ సందర్భంగా 53 ఏళ్ల షారుఖ్ ట్విటర్ లో ఓ వీడియో విడుదల చేశాడు. తెల్లని
టీషర్ట్ , నల్లని ప్యాంట్ ధరించి దీవానా చిత్రంలో పోషించిన పాత్రలో మాదిరిగానే
బైక్ పై ప్రయాణిస్తూ తాజా వీడియోలో అభిమానుల్ని అలరించాడు. `హిందీ చలనచిత్ర
పరిశ్రమకు, అభిమానులకు వేనవేలు ధన్యవాదాలు.. మీరు చూపించిన అభిమానం ద్వారా భూమిపై
నా సగ జీవిత కాలం వెండితెరపై గడపగలిగాను.. మిమ్మల్ని సదా వినోదంలో ముంచెత్తెందుకు
ప్రయత్నించాను..కొన్ని సార్లు విజయాలు, మరొకొన్ని మార్లు అపజయాలు ఎదుర్కొన్నాను. మరికొన్నేళ్లూ
నట జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను.` అని ఆ పోస్టులో షారుఖ్ పేర్కొన్నాడు.
దీవానాలో మోటార్ సైకిల్ పై Koi Na Koi Chahiye అని పాడుతూ మీ గుండెల్లో చోటు సంపాదించుకున్నాను.
అందుకు మోటార్ సైకిల్ కంపెనీకి నా ధన్యవాదాలు. కానీ ఈసారి మోటారు బైక్ పై హెల్మెట్
ధరించే నడుపుతాను.. ప్రేమతో మీ షారుఖ్ అని కింగ్ ఖాన్ ఆ పోస్టులో విలువైన వ్యాఖ్యలు
రాశాడు.