రాహుల్ గాంధీ జన్మదిన
వేడుకల్లో అభినందనల వెల్లువ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన 49 జన్మదిన వేడుకల్ని ఘనంగా అభిమానుల
మధ్య జరుపుకున్నారు. బుధవారం ఆయనను తల్లి సోనియాగాంధీ తన నివాసంలో జన్మదిన
శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. చెల్లెలు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్
నేత గులాంనబీ అజాద్ పుష్పగుచ్ఛాలు అందజేసి పుట్టిన రోజు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ ట్విటర్ లో రాహుల్ గాంధీకి బర్త్
డే విషెస్ తెల్పుతూ కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మాజీ ప్రధాని
మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని రాహుల్
గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు తమ ప్రియతమ నేత జన్మదినాన్ని
పరస్పరం శుభాకాంక్షలు తెల్పుకుని ఘనంగా నిర్వహించుకున్నారు. తనకు పుట్టిన రోజు
అభినందనలు చెప్పిన అందరికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపారు.