సీజేఐకు క్లీన్
చిట్ పై మహిళల నిరసన
సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) రంజన్ గొగొయ్ కి అంతరంగిక విచారణ సంఘం క్లీన్ చిట్
ఇవ్వడంపై మహిళలు నిరసనకు దిగారు. మంగళవారం (మే7) సుప్రీంకోర్టు ఆవరణలో
పలువురు మహిళలు, న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. కనీసం విచారణ సంఘం ముందుకు
బాధితురాల్ని హాజరుకానివ్వలేదని ఆరోపించారు. ఆందోళనకారులు నినాదాలు చేస్తూ
ప్లకార్డులు ప్రదర్శించారు. అత్యంత ప్రముఖులు తిరిగే ప్రాంతం(వి.వి.ఐ.పి జోన్) కావడం వల్ల ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్
విధించారు. ఉల్లంఘించిన పలువురు ఆందోళన కారుల్ని అరెస్ట్ చేసి అక్కడ నుంచి
తరలించారు. విధివిధానాలు పూర్తయ్యాక పోలీసులు వారిని విడిచిపెట్టారు.