రాహుల్ ప్రియాంకల ఆనందహేల
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలు
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు బిజిబిజీగా తిరుగుతున్నారు. అనుకోకుండా
శనివారం (ఏప్రిల్27) అన్నాచెల్లెళ్లు ఇద్దరూ కాన్పూర్ విమానాశ్రయంలో కలిశారు. ఎవరి
ప్రచార సభలకు వారు వెళ్తున్న సమయంలో వీరిద్దరూ ఎదురుపడ్డంతో ఇలా ఆనందాన్ని
పంచుకున్నారు. ప్రియాంక కాన్పూర్ విమానాశ్రయానికి వస్తున్నారని తెలిసి అప్పటికే అక్కడ
ఉన్న రాహుల్ సోదరిని పలకరించడానికి ఎదురెళ్లారు. అన్నను చూడగానే ఉబ్బితబ్బిబైన
ప్రియాంక ఒక్క ఉదుటన రాహుల్ చెంతకు చేరి ఆలింగనం చేసుకుని సంతోషాన్ని వ్యక్తం
చేశారు. ‘ఎన్నిక ల ప్రచారంలో విస్తృతంగా
పర్యటిస్తున్నాను నీ మంచి సోదరుడికి ఇచ్చే విమానం ఇదేనా’ అని సరదాగా ప్రియాంకతో
జోక్ చేశారు. అందుకు స్పందించిన ప్రియాంక అన్న భుజాలపై చేతుల వేసి నవ్వులు చిందించారు.
ప్రియాంక ప్రయాణిస్తున్న విమానాలతో పోలిస్తే వాస్తవానికి రాహుల్ ప్రచారానికి
వెళ్తున్న విమానాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. నాల్గో దశలో అమేథి, సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా ప్రచారానికి ఈ రోజు ఆఖరు కావడంతో శనివారం అమేథి ఎన్నికల
ప్రచారానికి వెళ్తూ రాహుల్ కాన్పూర్ విమానాశ్రయానికి వచ్చారు. ప్రియాంక బారబంకి, ఉన్నవ్ రోడ్ షోలకు వెళ్తూ ఇక్కడకు వచ్చారు.