ఇంకా బంకర్లలోనే కొందరు..
ఉక్రెయిన్ లో ఇంకా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. సుమీ లోగల బంకర్లలో వీరంతా తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ లో నోఫ్లైజోన్ ఆంక్షలు నేటి నుంచి అమలు కావచ్చని భావిస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 700 మంది విద్యార్థులు సుమీలోనే కనీస సౌకర్యాలు లేక అలమటిస్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులు దాటడానికి ఎదురుచూస్తున్నారు. అయితే రష్యా దాడులు తీవ్రమైన సమయంలో వారంతా ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. తొలుత వీరందర్ని రష్యా మీదుగా భారత్ కు తీసుకురావాలని మన రాయబార కార్యాలయం యత్నించింది. అయితే ప్రస్తుత తరుణంలో ఈ యత్నం ప్రమాదకరమని భావిస్తున్నారు. ఈ విద్యార్థుల్ని పోలెండ్, హంగేరీల మీదుగానే భారత్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
No comments:
Post a Comment