దర్శకధీర@20
రాజమౌళి ఈ పేరు సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్. తెలుగు సినిమా పరిశ్రమను మరోసారి మహోన్నతంగా ప్రపంచానికి చూపించిన ఘనుడు. బాహుబలి-1,2 సినిమాలను నభూతో నభవిష్యతి అనే రీతిలో మలిచిన గ్రేట్ మేకర్. జూనియర్ ఎన్టీయార్ హీరోగా స్టూడెంట్ నం.1 చిత్రంతో పరిశ్రమలో మెగా ఫోన్ చేతపట్టాడు. ఓటమి మాట తన డిక్షనరీలో లేదని నిరూపించిన ఈ జక్కన పుట్టినరోజు ఈరోజు. రాజమౌళి దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్టీయార్, రామ్ చరణ్‌లతో ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) అనే భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చాలా యేళ్ల తర్వాత తెలుగు తెరపై తళుకులీననున్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. చరిత్రలో అసలు కలవని కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఫాంటసీ కథలకు క్లాస్, మాస్ పల్స్ జోడించి హిట్లు మీద హిట్లు కొడుతూ తనకు తనే సాటిగా దూసుకెళ్తున్నాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం` తన చివరి చిత్రంగా తీస్తానని పలు ఇంటర్వ్యూల్లో రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా బహుబలి చిత్రాల్ని తలదన్నే మరో చిత్రరాజమవుతుందనడంలో సందేహమే లేదు.
No comments:
Post a Comment