ఐఆర్‌సీటీసీ
'డివైన్ బాలాజీ దర్శన్'
తిరుమలలో శ్రీవారిని
దర్శించుకోవాలని ఆసక్తి చూపిస్తున్న వారికి శుభవార్త. కేవలం రూ.990కే తిరుమల ప్రయాణంతో పాటు స్వామి వారి
దర్శనభాగ్యం దక్కనుంది. భారతీయ రైల్వే ఐఆర్‌సీటీసీ 'డివైన్ బాలాజీ దర్శన్' ప్యాకేజీని తిరిగి ప్రారంభించింది. కరోనా వైరస్
మహమ్మారి ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ కాస్త తగ్గిన నేపధ్యంలో లాక్ డౌన్ ఆంక్షల్ని
సడలిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా కరోనా భయంతో ఎక్కడికీ వెళ్లలేకపోయిన ప్రజలు
తీర్థయాత్రలు, టూర్ల
పై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని ఆసక్తి
చూపిస్తున్నారు. అటువంటి వారు ముందుగా 'డివైన్
బాలాజీ దర్శన్' ప్యాకేజీ
బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు తిరుపతికి చేరుకున్న తర్వాత ఈ ప్యాకేజీ
మొదలవుతుంది. ఈ ప్యాకేజీ కింద భక్తులను ఉదయం 8
గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో పికప్ చేసుకుని తిరుమలకు తీసుకెళ్తారు. ప్రత్యేక
ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా మధ్యాహ్నం 1 గంట
లోపే శ్రీవారిని దర్శించుకుంటారు.
తిరుమలలోనే భోజనం చేశాక భక్తులు తిరుచానూర్ బయల్దేరుతారు. తిరుచానూర్‌లో
పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తైన తర్వాత భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్‌లో
దిగబెడతారు. దాంతో వన్డే తిరుమల టూర్ ముగుస్తుంది.
No comments:
Post a Comment