స్వామి
కృపతోనే సీజేఐ స్థాయి
శ్రీవేంకటేశ్వరస్వామి దయ
వలనే తను ఈరోజు అత్యున్నత స్థానానికి
చేరుకున్నట్లు సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల స్వామి
వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆయన ఆలయానికి విచ్చేసి స్వామి వారి సేవలో
పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద జస్టిస్ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకకులు
వేణుగోపాల దీక్షితులు, ఇతర
అర్చకస్వాములు వారికి శ్రీవారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఈ సాయంత్రం తెలంగాణ
రాజ్ భవన్ కు చేరుకున్నారు. సీజేఐ హోదాలో ఆయన తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్
తమిళిసై జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు శంషాబాద్
ఎయిర్ పోర్టులో జస్టిస్ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, మంత్రులు, జీహెచ్‌ఎంసీ
మేయర్ విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి చీఫ్ జస్టిస్ కారులో తెలంగాణ
రాజ్ భవన్‌కు చేరుకున్నారు.
No comments:
Post a Comment