టీటీడీకి ముంబయి వ్యాపారవేత్త రూ.300 కోట్ల భారీ విరాళం
తిరుమల వెంకన్న పట్ల ఓ ముంబయి వ్యాపారవేత్త అచంచల భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నాడు. తిరుపతిలో నిర్మించతలపెట్టిన చిన్న పిల్లల ఆసుపత్రికి ఏకంగా రూ.300 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు. సంజయ్ సింగ్ అనే ఆ భక్తుడు తన ఫౌండేషన్ ద్వారా యావత్ ఆసుపత్రి నిర్మాణ ఖర్చుని భరిస్తానని తెలిపారు. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియాకు వివరాలు అందించారు. కిమ్స్ ఆవరణలో 300 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించాలని గత ఏడాది టీటీడీ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల బోర్డు సమావేశంలో నూతన హాస్పిటల్ నిర్మాణం గురించి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. మొత్తం ఆసుపత్రి వ్యయాన్ని భరించేందుకు సంజయ్ సింగ్ ముందుకు రావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
No comments:
Post a Comment