మెట్రో ప్రారంభం.. పలుచగా జనం
దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మెట్రో రైలు సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. మార్చి 22న ఆగిన మెట్రో రైలు కూత మళ్లీ ఈ ఉదయం నుంచే వినపడుతోంది. అయితే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ అంతంతమాత్రంగానే ఉంది. దేశంలోని 11 నగరాల్లో ఈ సోమవారం ఉదయం నుంచి మెట్రో సర్వీసుల్ని పునరుద్ధరించారు. అన్ లాక్ 4లో సడలించిన నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ చేతులు శానిటైజ్ చేసుకున్న ప్రయాణికుల్నే మెట్రోలోకి అనుమతిస్తున్నారు. అదే విధంగా టికెట్ల ను క్యూఆర్ కోడ్ ద్వారా లేదా స్మార్ట్ కార్డ్ ద్వారా పొందే వీలు కల్పించారు. హైదరాబాద్‌లో సైతం మార్చి 22న ఆగిన మైట్రో రైళ్లు ఈరోజే మళ్లీ ట్రాక్ ఎక్కాయి. కారిడార్-1 మియాపూర్- ఎల్బీనగర్ మధ్య మెట్రో కూత వినిపించింది. లాక్ డౌన్ కు ముందు వరకు హైదరాబాద్ మెట్రో ద్వారా నిత్యం దాదాపు లక్షమంది ప్రయాణించేవారు. ఇప్పుడు మూడో వంతు మందికి మాత్రమే అనుమతి ఉంది..అంటే కేవలం 30 వేల మందికే ప్రయాణించే అవకాశం కల్పించారు.
No comments:
Post a Comment