చైనాలో
హోటల్ కుప్పకూలి 29 మంది దుర్మరణం
చైనాలో చోటు చేసుకున్న ఘోర దుర్ఘటనలో 29 మంది దుర్మరణం పాలయ్యారు. జియాంగ్ఫెన్ కౌంటీలోని చెంజ్వాంగ్ గ్రామంలో జుజియన్ అనే హోటల్ శనివారం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. 80 ఏళ్ల వృద్ధుడి జన్మదిన వేడుకను నిర్వహిస్తుండగా ఈ దారుణం జరిగింది. వేడుక జరుగుతున్న సమయానికి ఆ రెండంతస్తుల రెస్టారాంట్ లో 57 మంది ఉన్నారు. వీరిలో 29 మంది మృత్యుపాలవ్వగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 21 మంది స్వల్ప గాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు జిన్హూ వార్త సంస్థ పేర్కొంది. ఈ దుర్ఘటన ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్స్లో సంభవించినట్లు అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి.
No comments:
Post a Comment