`ఆరోగ్య సేతు`పై రాహుల్ గాంధీ డౌట్
ఆరోగ్య సేతు యాప్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా ఓ ప్రయివేట్ నిర్వహణ సంస్థకు యాప్ బాధ్యతలు కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. డేటా భద్రతకు భంగం కలగడం, వ్యక్తిగత గోప్యత సమస్యలు పెరుగుతాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అనేది మనల్ని సురక్షితంగా ఉంచాలే తప్పా నష్టపరిచేదిలా ఉండకూడదని హితవు పలికారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఈ యాప్ కీలకంగా మారుతుందని కేంద్రం భావిస్తున్నతరుణంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కలవరం కల్గిస్తున్నాయి. ఈ యాప్ ఓ అధునాతన నిఘా వ్యవస్థ అని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ యాప్ ద్వారా అనుమతి లేకుండానే మనపై నిఘా నెలకొంటుందని చెప్పారు. మరోవైపు సోమవారం (మే4) నుంచి దేశంలో ఆయా కార్యాలయాల్లో పని చేసే వారు తమ మొబైళ్లలో ఈ యాప్ ను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
No comments:
Post a Comment