మహారాష్ట్రలో మరొకరు బలి?
మహారాష్ట్రలోని ఆసుపత్రిలో
చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మరణించాడు. ఈ మధ్యనే సౌదీ అరేబియా నుంచి తిరిగివచ్చిన ఆ
వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు సుగర్, బీపీ ఎక్కువకావడంతో ఆస్పత్రిలో
చేరినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ వృద్ధుడు కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా చనిపోయినట్లు
నిర్ధారణ కాలేదు. కాగా ఇప్పటికే దేశంలో కరోనా కారణంగా చనిపోయిన ఇద్దరూ వృద్ధులే కావడం
గమనార్హం. దేశంలో తొలి కరోనా మృతి కర్ణాటకలో సంభవించగా రెండో కేసు ఢిల్లీలో నమోదయింది.
చనిపోయిన స్త్రీ,పురుషులిద్దరూ 65 ఏళ్లు పైబడినవారే. మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల వ్యక్తి శనివారం మధ్యాహ్నం
చనిపోయారు. బుల్దానా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఢిల్లీలో 69 ఏళ్ల కరోనా
బాధితురాలు మృతి చెందింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో
చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడయింది. అయితే ఆమెకూ బీపీ, సుగర్ ఉన్నట్లు వైద్యులు
తెలిపారు. మృతురాలి కుమారుడి వల్లే ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఆ వృద్ధురాలి కుమారుడు విదేశాల్లో పర్యటించి వచ్చినట్లు
సమాచారం.
No comments:
Post a Comment