భాగ్యరాజా
పిచ్చివాగుడు: హోరెత్తిన నిరసనలు
వయసు పెరిగేకొద్దీ ఒద్దిక పెరిగి బుద్ధి వికసించి
సమాజానికి ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పాలి. అందుకు భిన్నంగా మాట్లాడిన తమిళ దర్శక, నిర్మాత భాగ్యరాజా చివాట్లు తింటున్నాడు. కోలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లోనూ
పలు కుటుంబ, హాస్యరస చిత్రాలను నిర్మించి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన భాగ్యరాజా
మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. పురుషులకు చనువు ఇవ్వడం, ఎక్కువ సమయంపాటు
రెండేసి మొబైళ్లలో చాటింగ్ చేస్తుండడమే తాజా అత్యాచార ఘటనలకు కారణంగా
పేర్కొన్నాడు. అంతేకాకుండా తప్పంతా అబ్బాయిలదే అనడం తప్పు అని సూత్రీకరించాడు. ఓ
పురుషుడు వివాహేతర సంబంధం పెట్టుకుంటే అతని ఇంటి ఇల్లాలికి ఏమి నష్టం జరగదు..కానీ
అదే ఇల్లాలు అక్రమ సంబంధంలో ఉంటే కన్న పిల్లల్ని హత్య చేయడానికీ వెనుకాడదు..అంటూ
పేద్ద.. తత్వవేత్తలా విశదీకరించాడు. దాంతో సామాజికమాధ్యమాల్లో అతనిపై ట్రోలింగ్
పీక్ కు చేరింది. తాజా తమిళ సినిమా
మ్యూజిక్ లాంచ్‌లో భాగ్యరాజా ఈ పిచ్చిప్రేలాపన చేశాడు. సినీ పరిశ్రమకు చెందిన ఓ
ప్రముఖుడు ఇలా వ్యాఖ్యానించడం తగదని ప్రముఖ గాయని చిన్నయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం
చేశారు. తమిళనాడులో మహిళా సంఘాలు భాగ్యరాజా వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి.
No comments:
Post a Comment