ఐఏఎఫ్ సొంత హెలికాప్టర్ నే కూల్చేయడం పెద్ద తప్పు: భదౌరియా
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలాకోట్ లో
ఉగ్రతండాలపై మెరుపుదాడులు జరిపిన మరుసటి రోజున సొంత హెలికాప్టర్ నే క్షిపణితో
కూల్చేసి ఐఏఎఫ్ గ్రౌండ్ సిబ్బంది చాలా పెద్ద తప్పు చేశారని ఎయిర్ చీఫ్ మార్షల్
భదౌరియా అన్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారిగా విలేకర్లతో
మాట్లాడారు. జమ్ముకశ్మీర్ నౌషెరా సెక్టార్ లోని బుద్గామ్‌లో ఫిబ్రవరి 27న చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధ్యులపై
చర్యలు తీసుకోనున్నామన్నారు. భారత-పాకిస్థాన్ ల గగనతలంలో ఇరు దేశాల మధ్య యుద్ధ
వాతావరణం నెలకొన్న సమయంలో ఐఏఎఫ్ మిగ్-17 ప్రయాణిస్తోంది. హెలికాప్టర్‌లోని ఐఎఫ్ఎఫ్ ('ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ లేదా
శత్రువు') వ్యవస్థ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, గ్రౌండ్ సిబ్బంది, ఛాపర్
సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపం కారణంగా శత్రు విమానంగా భావించి క్షిపణితో సొంత
చాపర్ నే కూల్చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వాయుసేన సిబ్బందితో పాటు ఓ పౌరుడు దుర్మరణం
చెందారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఐఏఎఫ్ చాపర్ శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలోని గగనతలంలో ఉండగా అధికారులు తిరిగి రావాల్సిందిగా ఆదేశాలిచ్చారు. తిరిగి వస్తున్న
చాపర్ ను గ్రౌండ్ సిబ్బంది శత్రు విమానంగా భావించి క్షిపణి దాడి చేశారు. ఇందుకు
బాధ్యులైన నలుగురు అధికారులపై ఇప్పటికే పరిపాలనా చర్యలు తీసుకున్నారు. ఇద్దరు
సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రొసీజర్స్ క్రమశిక్షణ చర్యలు
ప్రారంభిస్తున్నట్లు భదౌరియా తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు
జరిపేందుకు మే ప్రారంభంలో, శ్రీనగర్ బేస్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (ఏఓసీ) ను వాయుసేన బదిలీ చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం
కారదని చీఫ్ మార్షల్ భదౌరియా ఈ సందర్భంగా హెచ్చరించారు.
No comments:
Post a Comment