కచ్చులూరు లాంచీ మృతుల కుటుంబాలకు పరిహారం విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచీ
మునకలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారాన్ని విడుదల చేసింది.
సెప్టెంబర్ 15న పాపికొండల విహార యాత్రకు బయలుదేరిన పర్యాటకులు లాంచీ మునిగిన
దుర్ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు
వద్ద విహారయాత్రికులు ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ట బోటు మునిగిపోగా 39 మంది
ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి
రూ.10 లక్షల పరిహారాన్ని ఏపీ సర్కారు ప్రకటించింది. తాజాగా రెండ్రోజుల క్రితమే
మునిగిన లాంచీని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఘటనా స్థలం నుంచి
వెలికితీసింది. ప్రభుత్వం గతంలో ప్రకటించిన మేరకు తొలివిడతలో శుక్రవారం 12 మంది బాధితుల
కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున పరిహారాన్ని విడుదల చేసింది. ఏపీ సీఎంఆర్ఎఫ్
(ముఖ్యమంత్రి సహాయ నిధి) ఫండ్ నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు చెక్కు అందనుంది. బాధిత
కుటుంబాలకు జిల్లా కలెక్టర్ పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు.
No comments:
Post a Comment