అస్త్రా క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం
పూర్తి
స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన
గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాల్ని ఛేదించే అస్త్రా క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైంది.
ఒడిశాలోని బంగాళాఖాతంపై సుఖోయ్-30 ఎం.కె.ఐ. యుద్ధ విమానం నుంచి మంగళవారం ఈ పరీక్షను భారత సైన్యం
విజయవంతంగా పూర్తి చేసింది. నిరంతరం నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఈరోజు అస్త్రా
క్షిపణి ప్రయోగాన్ని చేపట్టారు. వివిధ రాడార్లు, ఎలక్ట్రో ట్రాకింగ్ వ్యవస్థ,
సెన్సార్ల నుంచి అందిన సమాచారం ప్రకారం అస్త్రా లక్ష్యాన్ని కచ్చితంగా
ఛేదించినట్లు భారత సైనికాధికారులు ధ్రువీకరించారు. అవసరాలకు అనుగుణంగా అస్త్రాను
ప్రయోగించొచ్చన్నారు. మధ్యంతర, సుదీర్ఘ శ్రేణిలోని లక్ష్యాల్ని ఈ క్షిపణి ఛేదించగలదని
పేర్కొన్నారు.
No comments:
Post a Comment