పాకిస్థాన్ లో నాన్, రోటీల ధరలు
తగ్గించాలని ఇమ్రాన్ ఆదేశం
పాకిస్థాన్ లో గ్యాస్, గోధుమ పిండిలపై సుంకాలు తగ్గించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం
నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గం సమన్వయ సమావేశంలో పాల్గొన్న ప్రధాని బృందం ఈ మేరకు
నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో సామాన్యులకు
అందుబాటులో ఉండే విధంగా నాన్, రోటీ ధరల్ని వెంటనే తగ్గించాలని ఆదేశాలిచ్చారు. మునుపటి
మాదిరిగా పేదలతో పాటు అందరికీ అందుబాటులో ఉండేలా నాన్, రోటీ ధరలు తగ్గించాలన్నారు.
గతంలో పాకిస్థాన్ లో నాన్ ధర రూ.8-10 ఉండగా రోటీ రూ.7-8 కు లభించేది. అయితే గ్యాస్,
గోధుమ పిండిలపై పన్నులు పెంచడం వల్ల నాన్, రోటీ ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం నాన్
ధర రూ.12-15, రోటీ ధర రూ. 10-12కు పెరిగిపోయింది. తక్షణం ఇదివరకటి ధరలకు నాన్, రోటీల
ధరలు తగ్గాలని ఇమ్రాన్ హుకుం జారీ చేశారు.
No comments:
Post a Comment