సోషల్ మీడియా వల్ల కెరీర్
విచ్ఛిన్నం:జులియా రాబర్ట్స్
Friday, July 5, 2019
Building career was a methodical endeavour earlier: Julia Roberts
ఇటీవల సోషల్ మీడియా అంటే భయపడి
బయటకు వచ్చేస్తున్న తారల జాబితా పెరిగిపోతోంది. ప్రముఖ హాలివుడ్ నటీమణి జులియా
రాబర్ట్స్ తాజాగా సోషల్ మీడియాపై విముఖత వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డు
గ్రహీతయిన ఈ అమెరికా నటీమణి బ్రిటన్ మ్యాగ్ జైన్ `మేరీ క్లేర్` కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
వర్ధమాన నటీనటులకు సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తలు చెప్పారు. సోషల్ మీడియా పోకడలు
ఇప్పుడు మారిపోయాయని వర్ధమాన నటీనటుల కెరీర్ ను సోషల్ మీడియా విచ్ఛిన్నం చేస్తుందని
తేల్చిచెప్పారు. లేనిపోని వార్తల వ్యాప్తికి సోషల్ మీడియా వేదికవుతోందన్నారు. తను
పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల ద్వారా
ఫొటోలు తీసుకునే తంతు లేదని చెప్పారు. 1987లో తొలిసారిగా ఆమె స్వీయ దర్శకత్వంలో `ఫైర్
హార్స్` అనే వీడియో ఫీచర్ ఫిల్మ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి
నుంచి పలు టెలివిజన్ సిరీస్ ద్వారా హాలివుడ్ చిత్రాల్లో హీరోయిన్ స్థాయికి ఎదిగారు.
అమెరికా ప్రముఖ పర్యావరణ ఉద్యమకర్త `ఎరిన్ బ్రోకోవిచ్` బయోగ్రఫీ చిత్రంలో నటించిన జులియా
2001లో బెస్ట్ యాక్ట్రస్ కేటగిరి నుంచి తొలి ఆస్కార్ (అకాడెమీ అవార్డు) అవార్డును అందుకున్నారు.
నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా, నటిగా వందకు పైగా చిత్రాలకు జులియా పనిచేశారు.
ఆస్కార్ కు మరో మూడు సార్లు ఆమె నామినేట్ అయ్యారు. మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
సొంత చేసుకున్నారు. బ్రిటిష్ అకాడెమీ అవార్డును ఓసారి గెలుచుకున్నారు. `స్టీల్
మెగ్నోలియస్`, `ప్రెటీ ఉమెన్`, `ఆగస్ట్ ఒసాజె కౌంటీ` చిత్రాలకు గాను ఆమె ఆస్కార్
అవార్డ్ నామినేషన్ సాధించారు. 1990లో విడుదలైన కామెడీ చిత్రం `ప్రెటీ ఉమన్` జులియాకు
ప్రపంచ వ్యాప్తంగా ఆశేషంగా అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఆమె నటించిన టాప్-10 చిత్రాలుగా America
Sweetheart’s, Eat Pray Love, Runaway Bride, Closer, Mystic
Pizza, My Best
Friend’s Wedding, Notting Hill, Pretty Woman, Erin Brockovich, Wonder, Homecoming, Ben Is Back(2018) అభిమానుల విశేష ఆదరణ పొందాయి. 30 ఏళ్ల క్రితం ఒకరు బాగా
నటిస్తే మరో చిత్రానికి ఎంపికయ్యే వారని ఇప్పుడు చిత్ర పరిశ్రమ కూడా చాలా
మారిపోయిందని జులియా ఆవేదన వ్యక్తం చేశారు. భర్త, పిల్లలు కుటుంబ బాగోగుల్ని తన
తల్లి చూసుకుంటారని దాంతో తను పూర్తిగా సినిమాలపై దృష్టి
కేంద్రీకరించగల్గుతున్నట్లు జులియా చెప్పారు. ఏడాదిలో ఆమె కేవలం రెండు వారాలు మాత్రమే
విశ్రాంతి తీసుకుని యావత్ కుటుంబం కోసం కష్ట పడతారన్నారు. సినిమా షెడ్యుల్స్
వ్యవహారాల్ని తన భర్త సినిమాటోగ్రాఫర్ డేనియల్ మోడర్ చూసుకుంటారని జులియా తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment