మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల్ని రక్షించిన బృందాలకు
అమితాబ్ అభినందనలు
మహారాష్ట్రలో ఇటీవల జలదిగ్బంధనానికి గురైన మహాలక్ష్మి ఎక్స్
ప్రెస్ ప్రయాణికుల్ని రక్షించిన సహాయక రక్షణ బృందాల్ని ఆలిండియా సూపర్ స్టార్
అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. శనివారం థానే జిల్లా సమీపంలోని వంగణీ ప్రాంతంలో ఈ
రైలు వరద నీటిలో చిక్కుబడి 1050 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడిన సంగతి
తెలిసిందే. వారందరూ సుమారు 17 గంట పాటు రైల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
గడిపారు. సమాచారం అందుకున్న సహాయక రక్షణ బృందాలు, భారత సైన్యం రంగంలోకి దిగి గంటల తరబడి శ్రమించి ప్రయాణికులందర్ని
సురక్షితంగా వరద నీటి నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. స్పందించిన బిగ్ బి , "ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అభినందనలు .. వారు మహాలక్ష్మి ఎక్స్
ప్రెస్ నుంచి 700 మంది ప్రయాణికులను విజయవంతంగా రక్షించారు! ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రైల్వే, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కు
ధన్యవాదాలు, మీరు చాలా గొప్ప కార్యం
నిర్వర్తించారు .. ఇది సాహసోపేతమైన , విజయవంతమైన కార్యక్రమం. నేను
ఎంతో గర్వ పడుతున్నాను. జై హింద్! అని ట్వీట్ చేశారు. ప్రాణాల కోసం పోరాడుతున్న
ప్రయాణికుల్ని ప్రాణాలొడ్డి రక్షించడానికి చేపట్టిన విజయవంతమైన సహాయక చర్య ఆయనను
ఎంతగానో కదిలించింది. దాంతో ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారందర్ని అమితాబ్ ప్రశంసలతో
ముంచెత్తారు.
No comments:
Post a Comment