ట్రాఫిక్ చైతన్యం కోసం యూపీ డీజీపీ సైకిల్ ర్యాలీ
వాహనచోదకులకు ట్రాఫిక్ చైతన్యం
కల్పించడంలో భాగంగా ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓం ప్రకాశ్
సింగ్ ఆదివారం లక్నోలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాళీదాసు మార్గం రోడ్ నం.5లో ఉదయం 6 కు ప్రారంభించిన ర్యాలీ సుమారు 10 కిలోమీటర్లు
సాగింది. లాల్ బాగ్ వద్ద కు చేరుకున్న అనంతరం డీజీపీ ఓంప్రకాశ్ మాట్లాడుతూ
వాహనచోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ముఖ్యంగా మోటారు
బైక్ లు నడిపేవారు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించడం తప్పనిసరన్నారు. తద్వారా వారి
ప్రాణాలకే కాక సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. అదే విధంగా కార్లు
నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. శరీర వ్యాయామానికి, ఆరోగ్యానికి
సైకిల్ తొక్కడం (సైక్లింగ్) ఎంతో మేలంటూ అది ప్రజలకే కాక పోలీసులకు వర్తిస్తుందని
తెలియపర్చడానికే ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు డీజీపీ వివరించారు. ఈ
ర్యాలీలో డీజీపీ ఓం ప్రకాశ్ వెంట ఎస్.ఎస్.పి. కళానిధి నాథని, ఏడీజీ రాజీవ్ కృష్ణ,
ఎస్పీ వికాస్ చంద్ర త్రిపాఠి సహా పలువురు పోలీసులు పాల్గొన్నారు. దేశంలో నిత్యం
జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 15 వేల మంది దుర్మరణం చెందడమో తీవ్ర గాయాలపాలై
ఆసుపత్రులకు పరిమితమౌతోన్న ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. వీటిలో అధిక శాతం మరణాలు హెల్మెట్
ధరించని మోటారు బైక్ చోదకులు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవ్ చేస్తున్నవారివే కావడం గమనార్హం. ఒక్క
ఉత్తరప్రదేశ్ లోనే రోజూ 98 మంది బైకర్లు హెల్మెట్ పెట్టుకోక రోడ్డు ప్రమాదాల్లో
ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. యూపీలో ఈ సంఖ్య 2019 నాటికి తగ్గినా ఇంకా ప్రమాదకర
స్థాయిలోనే మరణాలు రోడ్డు ప్రమాదాల్లో నమోదవుతున్నాయి.
No comments:
Post a Comment