ఐసీస్ ఉగ్రవాదుల ముప్పు: అప్రమత్తమైన భారత్ తీరరక్షణ దళం
భారత్ లో
చొరబడేందుకు ఐఎస్ఐఎస్(ఐసీస్) ఉగ్రవాదులు యత్నిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో
దేశ తీర రక్షణ దళం అప్రమత్తమయింది. శ్రీలంక నుంచి 15 మంది ఉగ్రవాదులు తెల్లటి
పడవలో బయలుదేరారని శనివారం(మే25) కచ్చితమైన సమాచారాన్ని నిఘావర్గాలు అందించాయి.
కేరళలోని త్రిసూర్, కోజికోడ్ తీరాల్లోని గస్తీని ముమ్మరం చేశారు. మత్స్యకార
సంఘాల్ని కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల్ని
గుర్తిస్తే తమకు తక్షణం సమాచారం అందించాలని కోరారు. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని
త్రాల్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాల ఎన్ కౌంటర్ లో పేరుమోసిన మిలిటెంట్ కమాండర్
జకీర్ రషీద్ భట్(జకీర్ ముసా)ను మట్టుబెట్టిన నేపథ్యంలో దేశంలోని భద్రతా, నిఘా
వర్గాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. అదే క్రమంలో నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం
కేరళ తీరంలో రెడ్ అలర్ట్ అమలవుతోంది.
No comments:
Post a Comment