జైల్లో చాలా ఇబ్బంది
పెట్టారు..క్షమాపణలు చెప్పను: ప్రియాంక శర్మ
`నేనేమీ క్షమాపణలు
చెప్పేంత తప్పు చేయలేదు..ఈ కేసుపై పోరాడతా` అని మమతా బెనర్జీ ఫొటో మార్ఫింగ్ కేసులో
అరెస్టయిన బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రియాంక శర్మ అన్నారు. న్యూయార్క్ మెట్ గాలాలో పాల్గొన్న ప్రియాంకచోప్రా ఫొటోలో సీఎం మమత ఫొటోను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేయడం, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడంతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బుధవారం(మే15)
ఉదయం ఆమె అలీపూర్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్ల తో మాట్లాడుతూ జైలులో
తన పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారని చెప్పారు. జైలర్ తనను జైలు గది లోకి నెట్టి
తలుపు వేశారన్నారు. అప్పుడు ఆయనతో తనేమీ నేరస్తురాలిని కాదని ఈ విధంగా
నెట్టడమేంటని ప్రశ్నించానన్నారు. జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని
ప్రియాంక శర్మ చెప్పారు. జైలుకు తరలించడంపై తన కుటుంబంతో పాటు తను కూడా వేదన చెందానన్నారు.
ప్రియాంకశర్మ విడుదల సందర్భంగా దక్షిణ కోల్ కతాలో గల జైలుకు పెద్ద సంఖ్యలో బీజేపీ
యువమోర్చా కార్యకర్తలు చేరుకుని ఆమెకు ఆహ్వానం పలికారు.
No comments:
Post a Comment