సన్
రైజెస్..కింగ్స్ పై పైచెయ్యి
·
వార్నర్
యథావిధిగా హాఫ్ సెంచరీ
·
45
పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి
ఉప్పల్ వేదికగా ఐపీఎల్ సీజన్ 12 సోమవారం నాటి
మ్యాచ్లో కింగ్స్ లెవన్ పంజాబ్ పై సన్ రైజర్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ
మ్యాచ్ ముందు వరకు హైదరాబాద్, పంజాబ్ జట్లు 5,6 స్థానాల్లో నిలిచాయి. రెండు టీంలు
చెరి అయిదు మ్యాచ్ ల్లో గెలిచినా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో పంజాబ్ కన్నా
హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ముందుంది. రెండు జట్లకు సోమవారం 12వ మ్యాచ్ కాగా పంజాబ్
పై హైదరాబాద్ స్పష్టమైన ఆధిపత్యాన్ని
ప్రదర్శించింది. సమష్టిగా రాణించి విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్
కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
వార్నర్ శరవేగంగా మళ్లీ అర్ధ సెంచరీ 56 బంతుల్లో 81 పరుగులు చేశాడు. క్రితం మ్యాచ్
లో ఒక్క బౌండరీ కూడా కొట్టని వార్నర్ ఈ మ్యాచ్ లో రెండు సిక్సర్లు సహా ఏడు
బౌండరీలు బాదాడు. వృద్దీ మాన్ సాహా (28), మనీశ్ పాండే (36)లు మెరవడంతో ఆరు వికెట్ల నష్టానికి
212 భారీ పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో షమీ, అశ్విన్ చెరి రెండు వికెట్లు,
మురగన్ అశ్విన్, అర్షదీప్ సింగ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. 213 పరుగుల లక్ష్య ఛేదనకు
బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ కె.ఎల్.రాహుల్
డెత్ ఓవర్ల వరకు ఆడి 79 పరుగులతో ఒంటరి పోరాటం చేసి వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్
27 పరుగులు, నికోలస్ పూరన్ చేసిన 21 పరుగులు జట్టును విజయతీరానికి చేర్చలేకపోయాయి.
ఏడు వికెట్లను కోల్పోయి నిర్దేశిత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 167 పరుగులు మాత్రమే
చేయగల్గింది. హైదరాబాద్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ చెరి మూడు వికెట్లు
తీయగా సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లోనూ భువనేశ్వర్ కుమార్ కు
వికెట్ దక్కలేదు. సన్ రైజర్స్ కలిసికట్టుగా ఆడి 45 పరుగుల తేడాతో పంజాబ్ ను
ఓడించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వార్నర్ నిలిచాడు.
No comments:
Post a Comment