చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.526 కోట్లు
జగనన్న తోడు పథకం కింద సుమారు
5లక్షల 10వేల మంది చిరువ్యాపారులకి మేలు చేకూరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల
చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సుమారు రూ.526కోట్ల
మొత్తాన్నినేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ వై.ఎస్.జగన్
మోహన్ రెడ్డి బటన్ నొక్కారు. ఒక్కొక్కరికి రూ.10
వేల ఆర్థిక సాయం అందనుంది. విడతల వారీగా
లబ్ధిదారులు తమ రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. కాలవ్యవధి ప్రకారం
రుణం చెల్లించిన అందరికీ వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. వడ్డీ వ్యాపారుల
బారిన పడకుండా చిరువ్యాపారులకు తోడుగా ఉండడమే తమ లక్ష్యమని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అయితే క్రమం తప్పకుండా రుణ వాయిదాలను బ్యాంకులకు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు జగనన్న తోడు కింద మూడో విడతతో కలిపి మొత్తం 14 లక్షల
16 వేల 14 మంది సాయం అందించినట్లయిందన్నారు. సోమవారం తాజాగా విడుదల చేసిన రూ.10 వేల
వడ్డీ లేని రుణ సాయం అందని వారేవరైనా ఉంటే ఆందోళన చెందొద్దని సీఎం కోరారు. రుణ సాయం
అందని వారు గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లను కలుసుకొని అవసరమైతే మళ్లీ జగనన్న తోడు పథకానికి
దరఖాస్తు చేయాలన్నారు.